రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా ఈ
కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.