కామారెడ్డి జిల్లా గాంధారి సొసైటీలో పంట రుణం ఆఫీసు ఖర్చు కింద అని పేర్కొంటూ రైతుల వద్ద రూ. 500 చొప్పున తీసుకుంటున్నారు. రైతులకు రుణమాఫీ జరగడంతో కొత్త రుణాలు తీసుకోవడానికి వెళ్లిన రైతులకు సొసైటీ వారు ఒక్కో రైతు నుంచి రూ. 500 తీసుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సొసైటీ సెక్రెటరీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ. పంట రుణం పత్రాలు, ఆఫీసు ఖర్చుల కింద రూ. 500 తీసుకుంటున్నామన్నారు.