శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దోమకొండలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది, ఉదయం 8: 30 నుండి ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు పసుపు కుంకుమలు వేసి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దోమకొండలోని చాముండేశ్వరి ఆలయంలో లక్ష పువ్వులతో అర్చన చేపట్టారు. అనంతరం అమ్మవారికి హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పల్లకి సేవ నిర్వహించారు.