కామారెడ్డి పట్టణానికి శనివారం విచ్చేసిన తెలంగాణ SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను దళిత నాయకులు అయ్యాల సంతోష్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన దళితులు ఇంకనూ వివక్షను అనుభవిస్తున్నారన్నారు. కొన్ని చోట్ల ఇతర కులస్తులు దళితుల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని, మరికొన్ని చోట్ల రాజకీయ పలుకుబడి, ధన బలం లేని దళితులపై దాడులు వంటివి జరుగుతున్నాయన్నారు.