
ఆలయాలపై మంత్రి ఆనం ఆసక్తికర వ్యాఖ్యలు
AP: పురాతన ఆలయాలకు సంబంధించి చరిత్ర, పవిత్రతను భవిష్యత్ తరాలకు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. హిందూ ధర్మాలు, ఆలయాలను కాపాడాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. రాష్ట్రంలో రాతికట్టడాలకు, కొన్ని ఆలయాలకు గత ప్రభుత్వ హయాంలో రంగులు వేయడం వల్ల పవిత్రతను కోల్పోయాయని, ఆ రంగులను తొలగించి, వాటిని కాపాడుతామన్నారు. దీని కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. భక్తులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు.