కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ, పీజీ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, ఈకో క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను విద్యార్థినీ విద్యార్థులు గురువారం తయారు చేశారు. చెరువులో మట్టిని ఉపయోగించి పర్యావరణ హిత గణపతి ప్రతిమలను తయారు చేసి ఉపయోగించటం వల్ల పర్యావరణ కాలుష్యం జరగకుండా ప్రకృతికి మేలు చేస్తుందని కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ హితవు పలికారు.