డెంగ్యూ వ్యాధి రాకుండా ముందుస్తుగా హోమియో వైద్యంలో మంచి మందులున్నాయని, ఏడాది దాటిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు మూడు రోజుల పాటు ఒక్కొడోసు వేసుకుంటే డెంగ్యూ నుంచి భయంలేకుండా నిశ్చింతగా ఉండవచ్చని హోమియో వైద్యుడు పల్స హరీష్ గౌడ్ అన్నారు. బీమా వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి ఎస్ఐసీ శాఖలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మధుమేహ రక్త పరీక్షలు, రక్తపోటు పరీక్షలతో పాటు డెంగీ నివారణ ముందస్తు హోమియో డోసులను ఉచితంగా అందజేశారు.