శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేసినట్లు ఆర్యవైశ్య సంఘ సభ్యులు మంగళవారం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రీ క్రోధి నామ సంవత్సరాలలో పాడి పంటలు పండి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆర్యవైశ్య సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.