కామారెడ్డి సబ్ జైలును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

72చూసినవారు
కామారెడ్డి సబ్ జైలును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
గాంధీ జయంతి, తెలంగాణ ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా కామారెడ్డి సబ్ జైలును బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఆర్‌వివి వరప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ ట్రయల్‌లో ఉన్న ఖైదీలు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత గౌరవంగా బతకాలని, తమ జీవితంలో కొత్త మార్పు వచ్చి సత్ప్రవర్తనగా నడుచుకోవాలని సూచించారు. అనంతరం ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. డిఎస్పి నాగేశ్వరరావు, సిఐ రామన్, జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్