రైస్ మిల్లుల యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

53చూసినవారు
రైస్ మిల్లుల యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
ఖరీఫ్ 2024-25 కాలానికి కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొనుగోలు కేంద్రాల వచ్చే ధాన్యం ను ఏరోజు కారోజు మిల్లులకు తరలించాలని అన్నారు. తరలించిన ధాన్యం వివరాలను ఆన్ లైన్ ప్రోక్యూర్మెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో వెంటనే నమోదు చేసి 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్