కామారెడ్డి పట్టణ పరిధిలోని రామేశ్వరపల్లి ఎనిమల్ కేర్ సెంటర్ ను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. 182 కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు చేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహారావు కలెక్టర్ కు తెలిపారు. గ్రామాల్లో కుక్కల సంతతి పెంచకుండా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. ఎనిమల్ కేర్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ తదితరులున్నారు.