కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిసరాలను పరిశీలించి, స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించి, పోలీస్ స్టేషన్ పని తీరును తెలుసుకొని, పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుని స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామ పోలీసు అధికారులకు కేటాయించబడిన గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.