దోమకొండ: చదువుకు వయసుతో సంబంధం లేదు

73చూసినవారు
దోమకొండ: చదువుకు వయసుతో సంబంధం లేదు
చదువుకు వయసుతో సంబంధం లేదని కామారెడ్డి సెగ్మెంట్ దోమకొండ మండల ప్రత్యేక అధికారి జ్యోతి అన్నారు. శుక్రవారం దోమకొండలో అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో వయోజన విద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. చదువురాని 15ఏళ్ళు దాటిన వయోజనులకు చదవడం రాయడం నేర్పాలన్నారు. గ్రామంలో 15ఏళ్ళు దాటిన నిరక్షరాస్యులను ఉల్లాస్ యాప్ ముందు నమోదు చేసి పదిమందికి ఒక వాలంటరీ నియమించి నిర్వహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్