దోమకొండ మండల పిఆర్టియు అధ్యక్షుడు పన్యాల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆదివారం దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ తో పాటు పలువురు నాయకులు, స్నేహితులు శ్రీనివాస్ రెడ్డికి శాలువా కప్పి బొకేను అందించారు. ఆయనతో పాటు సింగిల్ విండో అధ్యక్షుడు నాగరాజు రెడ్డి, మాజీ సర్పంచులు నల్లపు శ్రీనివాస్, మట్ట శ్రీనివాస్, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు రాజు, తదితరులు పాల్గొన్నారు.