కామారెడ్డి జిల్లా దోమకొండ మండల మాజీ సర్పంచ్, మాజీ సిడిసి చైర్మన్ ఐరన్ ఈ నర్సయ్యను బుధవారం పార్లమెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ పరామర్శించారు. నరసయ్య కూతురు శివాని హైదరాబాదులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల, ఆయనతోపాటు పలువురు నాయకులు వచ్చి ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును వారు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.