దోమకొండ: ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలి

55చూసినవారు
దోమకొండ: ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలి
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా నిర్మించుకోవాలని దోమకొండ జడ్పిటిసి మాజీ సభ్యుడు తీగల తిరుమల గౌడ్ తెలిపారు. శుక్రవారం దోమకొండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ముగ్గు పోశారు. నిరుపేదలకు ప్రభుత్వం ఇంద్ర మహిళలను మంజూరు చేస్తుందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్