కామారెడ్డి దోమకొండ పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను మాజీ జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్ గౌడ్ కు శనివారం స్థానిక ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య అందజేశారు. ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసి, ఉత్సవాలకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పున్న లక్ష్మణ్, ఉపాధ్యక్షులు అబ్రమైన పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన రాజేందర్, ఉప కార్యదర్శి బట్టు రాజు, కోశాధికారి గంప సంతోష్ కుమార్ పాల్గొన్నారు.