వృద్దులు సామాజిక సేవలో ముందుండాలి: , జిల్లా కలెక్టర్

85చూసినవారు
వృద్దులు ఆరోగ్యవంతంగా ఉంటూ, సామాజిక సేవలో పాల్గొనాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి వయో వృద్ధుల ఫోరం భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వృద్దులు ఆరోగ్యవంతంగా ఉండాలని, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వారం పాటు వృద్ధుల దినోత్సవం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్