ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సదాశివనగర్ మండలం కల్వారాల్ గ్రామానికి చెందిన భావికను ఘనంగా సన్మానించారు. భావిక ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో 581/600 మార్కులు సాధించి, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో మొదటి ర్యాంక్‌ను పొందినందుకు ఆమెను ఎమ్మెల్యే గారు అభినందించారు.