గత ప్రభుత్వ పాలకుల అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి. అందులో భాగంగా గురువారం తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా ముందడుగు వేశారు.