మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఐఎస్ఆర్డి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు సోలంకి రవళి అన్నారు. శుక్రవారం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసను ఎదుర్కోవాలన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని చెప్పారు.