యూత్ ఫర్ యూనిట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

79చూసినవారు
యూత్ ఫర్ యూనిట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన యూత్ ఫర్ యూనిట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన యూసుఫ్ స్థానిక పాఠశాలలో స్లీపర్ గా పని చేస్తున్నారు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుండగా తనకు ఉన్న కూతురు వివాహం కుదిరింది. వివాహం చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూత్ ఫర్ యూనిట్ సభ్యులు తమ వంతుగా రూ. 9వేలు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు.

సంబంధిత పోస్ట్