

మళ్లీ రాబోతున్న రాకీ భాయ్.. KGF-3 హింట్ (VIDEO)
KGF ఛాప్టర్-2 సినిమాకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో "KGF ఛాప్టర్-3" పై హింట్ ఇవ్వడంతో యశ్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. యశ్ గొంతుతో "సీ యూ సూన్" అనే మాటలతో ముగిసిన వీడియో అభిమానుల ఆశలు రెట్టింపు చేసింది. మరోవైపు యశ్ మాట్లాడుతూ.. KGF-3 ఖచ్చితంగా వస్తుందని, ప్రస్తుతం టాక్సిక్, రామాయణం ప్రాజెక్టులపై దృష్టి పెట్టానని తెలిపారు.