రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హైదారాబాద్ లో తెలంగాణ భవన్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మండల జడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొని మర్యాద పూర్వకంగా కేటీఆర్ ను కలిశారు. గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందాలని, పార్టీని బలోపేతం చేయాలని కోరినట్లు తెలిపారు.