వయోవృద్ధులకు ఉచిత వైద్య శిబిరం

79చూసినవారు
వయోవృద్ధులకు ఉచిత వైద్య శిబిరం
దోమకొండ మండల కేంద్రంలోని అంగడి బజార్ ప్రాంతంలో శుక్రవారం ఆయుష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కీర్తన మాట్లాడుతూ, ఆయుర్వేద ఔషధం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, దీనిని ఎంచుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా కల్పించే ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్య భారత్ లో భాగంగా కావాలని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్ కోరారు.

సంబంధిత పోస్ట్