ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

81చూసినవారు
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లిలో ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. విక్రమ్ రోగులకు వైద్య పరీక్షలు, ఈసీజీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. వైద్య సిబ్బంది తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్