మున్సిపల్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

51చూసినవారు
మున్సిపల్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్రం కోసం ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ సుజాత, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్