గాంధీజీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అంజయ్య గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు.