కామారెడ్డి జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్

61చూసినవారు
కామారెడ్డి జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్
దారి దోపిడీలు, గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ఆరు నెలలుగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు జాతీయ రహదారులపై దారి దోపిడీలు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని పలు పోలిస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్