రాజంపేటలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

77చూసినవారు
రాజంపేటలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారులు స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ అనిల్ కుమార్ జెండాను ఎగరవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో రాజేశం, పీఎస్ లో ఎస్సై పుష్పరాజ్ జెండాను ఆవిష్కరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్