మనవరాలిని కిడ్నాప్ చేసిన తాత: నిందితుడు అరెస్ట్

75చూసినవారు
మనవరాలిని కిడ్నాప్ చేసిన తాత: నిందితుడు అరెస్ట్
మనవరాలిని తాత కిడ్నాప్ చేసిన ఘటన శనివారం కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. మేడ్చల్ సమీపంలోని మచ్చ బొల్లారంకు చెందిన కలియ స్వప్న భర్త రాముతో గొడవల కారణంగా రెండు నెలలుగా 18 నెల కుమార్తె అంజలితో కలిసి కామారెడ్డి లోని జీవధాన్ ఆసుపత్రి ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటుంది. ఆమె మామ గోలి అలియాస్ రామచందర్ అప్పుడప్పుడు వచ్చి అంజలిని చూసి వెళ్లేవాడు. అంజలిని స్వప్నకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఎత్తుకొని వెళ్ళిపోయాడు. బొల్లారం రైల్వే స్టేషన్ లో నిందితుడిని అదుపులోకి తీసుకుని చిన్నారితోపాటు కామారెడ్డికి తీసుకువచ్చారు. బాలికను తల్లికి అప్పగించి నిందితుని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్