రాజంపేట మండలంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

78చూసినవారు
రాజంపేట మండలంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
రాజంపేట మండల కేంద్రంలో శనివారం హనుమాన్ శోభాయాత్రను స్థానిక సాయిబాబా ఆలయం నుండి గ్రామంలోని ప్రధాన కూడళ్లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఆముదాల రమేష్ మాట్లాడుతూ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య శ్రీరాముడి ఆశీస్సులతో భవిష్యత్తులో తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాలని అంజన్న స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్