కామారెడ్డిలో దంచి కొట్టిన వాన: జలమయమైన రోడ్లు

67చూసినవారు
కామారెడ్డిలో దంచి కొట్టిన వాన: జలమయమైన రోడ్లు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో కామారెడ్డి పట్టణంలో ప్రధాన రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో చెరువులను తలపించాయి. పట్టణంలో నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వెళ్లే రోడ్లు, విద్యానగర్, అశోక్ నగర్, బతుకమ్మ కుంట, అయ్యప్ప నగర్, తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్