ఫిట్నెస్ లేకుంటే సీజ్ చేస్తాం

82చూసినవారు
ఫిట్నెస్ లేకుంటే సీజ్ చేస్తాం
ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన బస్సులకు వెంటనే ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రవేటు పాఠశాలలకు చెందిన 231 బస్సులు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 101 బస్సులకు ఫిట్నెస్ టెస్టులు పూర్తయ్యాయి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్