కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సిహెచ్. సింధు శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.