భిక్కనూరు మండల కేంద్రంలో గల శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రేణుకుమార్, ప్రిన్సిపాల్ అశోక్ యాదవ్ మాట్లాడుతూ, చదువుతో పాటు సాంస్కృతిక రంగాలలో విద్యార్థులు రాణించాలని సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలని తెలిపారు. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని గుర్తు చేశారు.