కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం 78 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.