దోమకొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారులతో పాటు కార్యదర్శిలు, పలు పార్టీలకు చెందిన జెండాల వద్ద ఆయా పార్టీల అధ్యక్షులు, పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల వద్ద జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. దోమకొండ కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులను అందించారు.