నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని ఒప్పించారు. వచ్చే నెలలో పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందుకోసం పలువురు ఆశావాహులు ఎవరికి వారుగా నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్ట్ కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.