సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన తీపిరిశెట్టి రజినీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బాధిత కుటుంబానికి నిజామాబాద్ పోస్టల్ అధికారి జనార్దన్ రెడ్డి రూ. 10 లక్షల భీమా చెక్కును అందించారు. బాధితుడు భూంపల్లి పోస్ట్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా ఐపీఓ సుస్మిత బెనర్జీ, ఉమ్మడి జిల్లా ఐపిపిబి బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్, సదాశివనగర్ ఎస్ పిఎం జగన్, భూంపల్లి బిపిఎం రమేష్, తదితరులు ఉన్నారు.