ఊరెళ్లే వారికి గుడ్న్యూస్.. నేటి నుంచి 6432 స్పెషల్ బస్సులు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారి కోసం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్న్యూస్ చెప్పారు. ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు నేటి నుంచి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ అధికారులు ప్రతి మేజర్ బస్టేషన్ వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.