లింగాపూర్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద 134వ జయంతిని పురస్కరించుకుని 11వ వార్డ్ కౌన్సిలర్ శీను, 9వ వార్డు కౌన్సిలర్ సుగుణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప మేధావి అని కొనియాడారు. నేటి యువత వారి బాటలో నడవాలని గ్రామ ప్రజల అందరి ముందు ప్రతిజ్ఞ చేశారు.