రాబోయే వేసవిలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లలో అదనపు ట్రాన్స్ పార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇంటర్ లింకింగ్ లైన్స్ వ్యవస్థ కోసం కామారెడ్డి పట్టణంలో రెండు అదనపు ట్రాన్స్ పార్మర్లను బిగించారు. ఇప్పటివరకు జిల్లాలో 70 ట్రాన్స్ పార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.