కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగుల కోసం డిసెంబర్ 4, 11, 18 తేదీల్లో సదరం క్యాంపులను నిర్వహించనున్నట్లు డిఆర్డిఓ సురేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెన్యువల్ కోసం 270 స్లాట్లు, కొత్తవారికి 1033 స్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మీ- సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.