కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలకు చెందిన 1999- 2001 బ్యాచ్ కు చెందిన ఇంటర్మీడియట్ బైపిసి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంతో కలుసుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత కలవడం ఉత్సాహంగా సంతోషంగా ఉందన్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుని సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.