కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎస్పీలు నరసింహరెడ్డి, చైతన్యరెడ్డి మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన అవిశ్రాంత కృషి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.