కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందినందుకు గాను కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్), శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితిల ఆధ్వర్యంలో ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, పర్ష వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.