పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కామారెడ్డి ఏఎస్పీ

83చూసినవారు
పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కామారెడ్డి ఏఎస్పీ
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ను శనివారం ఏఎస్పీ చైతన్య రెడ్డి తనిఖీ చేసారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న అన్ని రికార్డులను, కేసు ఫైళ్లను, కోర్టు రికార్థులను, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేసారు. సిబ్బందితో మాట్లాడి, వారి అవసరాలను తెలుసుకుని, ప్రజలతో మర్యాదగా మాట్లాడాలన్నారు. పట్టుబడిన వాహనాలు పరిశీలించారు. ఆయన వెంట టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి వున్నారు.

సంబంధిత పోస్ట్