ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో మంగళవారం మొదటి, రెండవ సంవత్సర డిగ్రీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం, నియంత్రణ పై అవగాహన కార్యక్రమంతో పాటు క్విజ్, చర్చ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, మాదకద్రవ్యాలకు దూరం ఉండాలన్నారు.