ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12 వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 14 నుండి జూలై 6 వరకు జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, ఐవిఎఫ్ సెంట్రల్ కమిటీ సభ్యుల సూచనల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలలో భాగంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడారు.